31-12-2025 01:06:28 AM
టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన
లండన్, డిసెంబర్ 30: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు. హ్యారీ బ్రూక్ సారథ్యంలోని 15 మందితో కూడిన ప్రొవిజినల్ జట్టులో గత వరల్డ్‌కప్‌లో ఆడిన 8 మంది ప్లేయర్స్ ఈ సారి కూడా చోటు దక్కించుకు న్నారు. యాషెస్ సిరీస్‌లో రాణించిన ఇద్దరు యువ ఆటగాళ్లు మెగాటోర్నీకి ఎంపికయ్యారు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న జాకబ్ బెథెల్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. మెల్‌బోర్న్ టెస్టులో బెథెల్ 40 రన్స్‌తో రాణించాడు. అలాగే ఐదు వికెట్లతో మెరిసిన జోష్ టంగ్‌కు కూడా చోటు దక్కింది.
ఇదిలా ఉంటే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో బాధపడుతున్నా మెగాటోర్నీ కోసం ఎంపిక చేశారు. టోర్నీ ఆరంభ సమయానికి అతను కోలుకుంటాడని ఇంగ్లాండ్ భావిస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంకతో జరిగే సిరీస్‌కు ఆర్చర్ దూరం కానున్నాడు. లంకతో సిరీస్‌ను వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని ఇంగ్లాండ్ ఎదురుచూస్తోంది. అందుకే మెగాటోర్నీని దృష్టిలో ఉంచుకునే ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేశారు. జమనరి 22 నుంచి ఫిబ్రవరి 3 వరకూ లంకలో పర్యటించనున్న ఇంగ్లాండ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
టీ20 వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ జట్టు: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, డకెట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియాం డాసన్, సామ్ కరన్, ఆదిల్ రషీద్ , రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కార్సే, జోష్ టంగ్, ల్యూక్ వుడ్