31-12-2025 01:03:44 AM
కివీస్‌తో వన్డే సిరీస్‌కు డౌటే
బెంగళూరు, డిసెంబర్ 30: న్యూజిలాండ్ తో సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్ , వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ ఎంట్రీ రీ ఎంట్రీ మరింత ఆల స్యం కానుంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాపై వన్డే ఆడుతుండగా ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఒకరోజు ఐసీయూలో కూడా ఉన్నా డు. తర్వాత కోలుకుని ఇటీవలే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టడంతో కివీస్‌పై వన్డే సిరీస్‌లో ఆడతాడని అంతా అనుకున్నారు.
మూడురోజుల క్రితం ఫిట్‌నెస్ కూడా సాధించి ప్రాక్టీస్‌లో బిజీగా గడుపుతున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది. అయితే శ్రేయాస్ 6 కిలోల బరువు తగ్గినట్టు సీవోఈ గుర్తించింది. బరువు తగ్గిన కారణంగా బ్యాటింగ్ చేసేందుకు ఎటువంటి ఇబ్బందీ లేకున్నా మజిల్ సామర్థ్యం క్షీణించినట్టు వైద్యు లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితుల్లో శ్రేయాస్‌కు రిటర్న్ టు ప్లే సర్టిఫికేట్ ఇవ్వలేమని వెల్లడించా రు.
దీంతో శ్రేయాస్ రీ ఎంట్రీ మరికొన్ని రోజు లు వాయిదా పడింది. ఒకవేళ శ్రేయాస్‌కు క్లియరెన్స్ లభించి ఉండుంటే విజయ్ హజారే ట్రోఫీ ఆడేవాడు. ఇప్పుడు కివీస్‌తో వన్డే సిరీస్ కూడా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ఆరంభం కానుండగా.. దీని కోసం భారత జట్టును మరో మూడు రోజుల్లో ప్రకటించనున్నారు. ఒకవేళ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయాస్ దూరమైతే విజయ్ హజారే నాకౌట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు.