20-05-2025 12:30:37 AM
-ఆరు పదవుల్లో ఒక్కటీ బీసీలకు ఇవ్వరా!
-నామినేటెడ్ పోస్టుల్లో 42 శాతం బీసీలకు ఇవ్వాల్సిందే
-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్
ముషీరాబాద్, మే 19: ఇటీవల నియమించిన రాష్ట్ర ఆర్టీఐ కమిషన్ నియామకా ల్లో సామాజిక న్యాయం పూర్తిగా కొరవడిందని, ఆరు పదవుల్లో ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వకుండా అగ్రకులాలకే కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణలో జరిగి న కులగణన లెక్కల ప్రకారం ప్రతి నామినేటెడ్ పోస్టులో 56 శాతం బీసీలకు వాటా కల్పించాల్సిందేనని డిమాండ్ చేశారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి ఎవరి వాటా వారికి ఇస్తామ ని హామీలు గుప్పిస్తూ, వాటిని అమలు చేయకపోవడం తగదన్నారు.సమాచార కమిషనర్లు కావలసిన అన్ని అర్హతలు బీసీలకు ఉన్నప్పటికీ నియమకాల్లో మాత్రం బీసీ కులమే అనర్హతగా మారిందా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్ర సమాచార కమిషనర్ పదవుల భర్తీలో బీసీలను పక్కకు పెట్టడం రెండు కోట్ల మంది బీసీలను అవమానించడమే అవుతుందని అన్నారు. తక్షణమే సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకుని బీసీలకు ఖాళీగా ఉన్న మిగతా మూడు సమాచార కమిషనర్ పదవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాం గ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు కులగనణ చేసి న్యాయం చేస్తామని పదేపదే చెబుతున్న దరిమిల బీసీ లు ప్రభుత్వానికి అండగా ఉన్నారని, కానీ ప్రభుత్వం మాత్రం చీఫ్ సెక్రటరీ నుంచి మొ దలుకొని యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్లు, సమాచార కమిషనర్లు నామినేటెడ్ పోస్టులు అన్నింటినీ అగ్రకుల సామాజిక వర్గాలకు కట్టబెట్టడాన్ని బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వంపై బీసీలు విశ్వాసం పొందాలంటే జనాభా దామాషా ప్రకారంగానీ, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసిన విధంగా 42 శాతంగాగానీ పదవులు ఇవ్వాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజుగౌడ్, బీసీ మేధావుల వేదిక కన్వీనర్ ప్రొ ఫెసర్ ఏం బాగయ్య, బీసీ యువజన సం ఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యాం కురుమ, గౌడ జన హక్కుల పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టే విజయ్‌కుమార్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాంప్రభూ, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడారి వెంకటేశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.