calender_icon.png 20 May, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

20-05-2025 12:33:00 AM

మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు

సంగారెడ్డి, మే 19(విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్  క్రాంతి వల్లూరు, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం  రెండు జిల్లాల్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజా సమస్యలపై వచ్చిన అర్జీలను కలెక్టర్లు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు అధికారులు ప్రత్యేక  శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

సంగారెడ్డి జిల్లాలో ప్రజావాణిలో 44 దరఖాస్తులు రాగా రెవిన్యూ సమస్యలతో పాటు హౌసింగ్, డిపిఓ, ఎలక్ట్రిసిటి , డీఆర్ డిఓ శాఖల కు చెందిన అర్జీలు ఉన్నాయి. ప్రజావాణీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు  చంద్రశేఖర్, మాధురి, డిఆర్‌ఓ పద్మజ రాణి, సంబంధిత శాఖల  జిల్లా అధికారులు, ఆర్డిఓలు  పాల్గొన్నారు. అలాగే మెదక్ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి ధరణి దరఖాస్తులు12, ఇందిరమ్మ ఇండ్లు 13,

రేషన్ కార్డుకు సంబంధించి 3, ఇతర సమస్యలు 34  మొత్తం 62 ప్రజావాణిద దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. వీటిని వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.