calender_icon.png 26 December, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసీస్‌ను ఆపతరమా?

26-12-2025 01:40:39 AM

  1. పరువు కోసం ఇంగ్లాండ్ పోరాటం

నేటి నుంచే బాక్సింగ్ డే టెస్ట్

మెల్‌బోర్న్, డిసెంబర్ 25 : సొంతగడ్డపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను మరో 2 మ్యాచ్‌లు మిగిలుండగానే సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా ఇప్పుడు వైట్‌వాష్ లక్ష్యం గా రెడీ అవుతోంది. శుక్రవారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగబోయే బాక్సింగ్ డే టెస్టులోనూ ఇంగ్లాండ్‌ను చిత్తు చేయాలని ఎదురుచూస్తోంది. మరోవైపు 0 ఇప్పటికే సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లీష్ టీమ్ పరు వు కోసం పాకులాడుతోంది.

గ్రౌండ్‌లో చెత్త ప్రదర్శన.. గ్రౌండ్ బయట తాగితందనాలాడిన వివాదం.. ఇటువంటి పరిస్థితుల మధ్య ఇంగ్లాండ్ జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. బాక్సింగ్ డే టెస్టులోనూ ఆస్ట్రేలియానే ఫేవరెట్. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఆసీస్ జట్టు లో మార్పులు జరిగాయి. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు విశ్రాంతినివ్వగా..వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు పై స్మిత్ క్లారిటీ ఇవ్వలేకపోయాడు.

ప్రస్తుతం 12 మందితో ఆసీస్ నాలుగో టెస్టు కోసం జట్టును ప్రకటించింది. ప్లేయింగ్ 11లో రెం డు స్థానాల కోసం ముగ్గురు పేసర్లు పోటీపడుతున్నారు. బ్రెండ న్ డాగెట్, మైకేల్ నాస ర్, జే రిచర్డ్‌సన్‌లలో ఇద్దరికే చోటు దక్కుతుందని స్మిత్ చెప్పాడు. మెల్‌బోర్న్ పిచ్‌ను పూర్తిగా పరిశీలించి మ్యాచ్‌కు ముందు నిర్ణ యం తీసుకుంటామన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో స్పిన్నర్ మర్ఫీకి చోటు దక్కే అవకాశా లు లేవు. ఇదిలా ఉంటే మూడో టెస్టులో రాణించిన ఉస్మాన్ ఖవాజా తన ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. అటు వికెట్ కీపర్ బ్యాట ర్ జోస్ ఇంగ్లీస్‌కు మాత్రం చోటు దక్కలేదు.

మరోవైపు ఇంగ్లాండ్ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. సిరీస్‌లో ఇప్పటి వరకూ ఆ జట్టు కనీస పోరాటం కూడా చేసిన దాఖలాలు లేవు. పైగా రెండో టెస్టు ముగిసిన తర్వాత దొరికిన గ్యాప్‌లో ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టి మరీ మద్యం సేవించిన ఇంగ్లాండ్ ఆటగాళ్ల వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఈసీబీ కూడా తీవ్రస్థాయిలో స్పందించి విచారణకు ఆదేశించింది. అటు బాజ్‌బాల్ వ్యూహంతో ఆసీస్‌ను నిలువరిద్దామనుకున్న ఇంగ్లాండ్ వ్యూహాలు అక్కడ ఫలించలేదు. అంచనాలు పెట్టుకున్న ఇంగ్లాండ్ కీలక బ్యా టర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు.

అందుకే మూడు టెస్టుల్లో ఒక్కటి కూడా ఇం గ్లీష్ జట్టు గెలవలేకపోయింది. కాగా నాలు గో టెస్టుకు ముందు కూడా ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింగి. జోఫ్రా ఆర్చర్ పక్కటెముకల నొప్పితో దూరమవగా.. ఓలీ పోప్ పై వేటు పడింది. వీరి స్థానాల్లో ఆట్కిన్సన్, జాకబ్ బెతెల్‌ను తీసుకుంది. పిచ్ విషయానికొస్తే మెల్‌బోర్న్ వికెట్ పేసర్లకు అనుకూ లించడం ఖాయం.