calender_icon.png 26 December, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీఎంట్రీకి శ్రేయాస్ అయ్యర్ రెడీ

26-12-2025 01:38:48 AM

ప్రాక్టీస్ మొదలెట్టిన స్టార్ బ్యాటర్

ముంబై, డిసెంబర్ 25 : టీమిండియా కీలక బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి సన్నద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన శ్రేయాస్ దాదాపు 2 నెలలకు పైగా ఆటకు దూరమయ్యాడు. చికిత్స తీసుకుని కోలుకున్న ఈ మిడిలార్డర్ బ్యాటర్ ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టాడు. దీని కోసం బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సీవోఈలో ఫిట్‌నెస్ మెరుగుపరుచుకుంటున్న శ్రేయాస్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో బిజీగా గడుపుతున్నాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి.

కివీస్‌తో టీ20లకు మాత్రమే బీసీసీఐ జట్టును ప్రకటించింది, వన్డే సిరీస్ సమయానికి పూర్తిగా ఫిట్‌నెస్ సాధిస్తే శ్రేయాస్ పేరును పరగణలోకి తీసుకుంటారు. ఈ లోపు శ్రేయాస్ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడే అవకాశాలున్నట్టు సమాచారం. సిడ్నీ వన్డేలో క్యాచ్ అందుకోబోయి గ్రౌండ్‌ను బలంగా గుద్దుకోవడంతో అతని ప్లీహానికి తీవ్రగాయమైంది. తర్వాత సిడ్నీలోనే అత్యుత్తమ చికిత్స అందించడంతో అప్పటి నుంచీ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఫిట్‌నెస్ సాధించే క్రమంలో సీవోఈ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే విజయ్ హజారేతో పాటు కివీస్‌తో వన్డే సిరీస్‌లోనూ ఆడడం ఖాయం.