23-05-2025 01:40:27 AM
మహబూబ్ నగర్ మే 22 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఒక నిబంధనలు అమలు అయితే ప్రవేట్ పాఠశాలలో మాత్రం మరో నిబంధనలు అమ లు అవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతిలో పడిన విద్యార్థులకు కొన్ని పాఠశాలలో 10వ తరగతి పాఠ్యాంశాలను ఇప్పటికే సగం పూర్తి చేశాయి.
9వ తరగతి విద్యాభ్యాసం చేయకుండానే ఆయా పాఠశాలలో పదవ తరగతి పాఠ్యాంశాలను ప్రారంభించి నిబంధనలు కేవలం ప్రభుత్వ పాఠశాలలకే ఉన్నట్లు వారి తీరును చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మాత్రం జూన్ వచ్చిన తర్వాత కొత్త పుస్తకాలు అందుకున్న తర్వాతే పాఠ్యాంశాలు ప్రారంభమవుతున్నాయి.
దీనికి తోడు కొన్నిసార్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీలు కూడా పదవ తరగతి చేరుకున్న విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలలో తీవ్ర నష్టం జరుగు తుంది. నిరుపేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పాఠ్యాంశాలు నిబంధన మేరకు ఆరంభం అవడంతో వార్షిక పరీక్షల్లోనూ కొంత వెనుకంచ కనిపిస్తుందని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, డబ్బులు కట్టే పాఠశాలకు ఒకలా నిరుపేదలు చదువుతున్న విద్యార్థుల పాఠశాలలకు మరోలా ఉంటే ఇలా అని ప్రశ్నిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ అంతతే..?
ప్రైవేట్ పాఠశాలలో దర్జాగా పాటలు బోధిస్తున్నప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభం కానప్పటికీ ఇప్పటికే పుట్టి శాతం కొన్ని ప్రైవేట్ పాఠశాలలో విద్యాబోధన పూర్తి అయిందంటే ప్రైవేట్ పాఠశాలల పనితీరు ఎంత ముందు ఆలోచనతో ఉందో అర్థం చేసుకోవాలి. అదే ప్రభుత్వ పాఠశాల విషయానికొస్తే జూన్ వచ్చినప్పటికీ కూడా పుస్తకాలు రాక..? వచ్చిన వసతులు లేక ఇలా లెక్కకు మించిన సమస్యలతో పదో తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం నష్టం వాటిల్లుతుంది.
ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు మంచిర్యాంకులు వస్తున్నాయని పెద్ద పెద్ద హోల్డింగ్ లో ప్రకటనలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలు నిబంధన మాత్రం అమలు చేయడం లేదని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికా రులు స్పందించి నిబంధనలను తూచా తప్పకుండా అందరికి సమానంగా పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
శిక్షణ ఇస్తున్నాం...
పదవ తరగతి పరీక్ష రాసి ఫెయిల్ అయి న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ముందు గా తొమ్మిదో తరగతి పూర్తయి పదవ తరగతిలో వచ్చిన విద్యార్థులకు సైతం శిక్షణ ఇవ్వాలని అనుకున్నాం. వస్తున్న కొన్ని వర్గీ కారణాలవల్ల పదవ తరగతిలోకి వచ్చిన విద్యార్థులకు శిక్షణ ఇవ్వలేకపోయాం.
శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడైనా విద్యాబోధన పదవ తరగతి విద్యార్థులకు జరిగితే అలాంటి జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుం టాం. ప్రభుత్వ పాఠశాలకు ప్రవేట్ పాఠశాలకు ఒకేలా నిబంధనలు ఉంటాయి. నిబంధనల వరకు పాఠశాలలను ముందుకు తీసుకుపోతాం.
ప్రవీణ్ కుమార్, డీఈవో, మహబూబ్ నగర్