12-07-2025 02:01:42 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జులై 11 (విజయక్రాంతి)/ముషీరాబాద్: హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మరో వివాదంలో చిక్కుకున్నారు. బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండా దిమ్మెను కుల అహంకారంతో కూల్చివేయించారని, మాదిగ సామాజిక వర్గాన్ని దూషించారని ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు.
దీనికి నిరసనగా శుక్రవారం ట్యాంక్ బ్ంప ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో భారీ ధర్నా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకుల కథనం ప్రకారం, జూలై 7న తమ సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్లోని ఎన్బీటీ నగర్లో ఎంఆర్పీఎస్ జెండా దిమ్మెను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, మేయర్ గద్వాల విజయ లక్ష్మి తన అధికార బలంతో, కుల వివక్షతో ఆ దిమ్మెను కూల్చివేయించారని వారు ఆరోపించారు.
ఈ సందర్భంగా తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ (మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్), వాటి అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఉదయం ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. నగరంలోని 15 నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదా లతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేట ర్ ఇంజం వెంకటస్వామి మాదిగ, నాయకులు గజ్జల రాజశేఖర్ మాదిగ మాట్లాడు తూ, మేయర్ విజయలక్ష్మి మాదిగ, ఉపకులాల సమాజానికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. జెండా దిమ్మెను అక్కడే తిరిగి నిర్మించాలని లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం అని హెచ్చరించారు.