calender_icon.png 11 October, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల కష్టానికి కన్నీళ్ల్లే మిగిలేనా?

10-10-2025 12:39:00 AM

  1. వర్షానికి ధాన్యం ఆగమాగం ఐకేపీ సెంటర్లను త్వరగా ప్రారంభించాలి 
  2. కుమ్మక్కైన రైస్ మిల్లు యాజమాన్యం అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నకిరేకల్ అక్టోబర్ 8 (విజయక్రాంతి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి ఆగం ఆగం అయింది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట చేతికి అందకుండా అయింది. ఒకపక్క రైస్  మిల్లర్లు కుమ్మక్కైనారు. ప్రభుత్వం ఐకెపి సెంటర్లను ఇంకా ప్రారంభించక పోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందుల గురవుతున్నారు. పండించిన పంటను ఐకేపీ తీసుకువచ్చిఆరబెట్టడామంటే  తీసుకు వస్తే అకాల వర్షం ఆగం ఆగం చేసే.

ఐకెపి సెంటర్లో సరైన వసతులు లేక స్థలం సదును లేకపోవడంతో అకాల వర్షానికి పూర్తిగా దాన్యమంతా కొట్టుకపోయి రైతులు లబోదిబో అంటున్నారు.  కొంతమంది రైతులు వరి కోతలు మొదలు పెట్టకపోవడంతో అకాల వర్షానికి  వరిసేనంత ఒరిగి వడ్లన్నీ రాలి తీవ్రంగా నష్టపోయారు. రైతులకు కష్టాలు కన్నీళ్లు తప్ప మిగిలేది ఏమీ లేదని వాపోతున్నారు. మా బాధలు ప్రభుత్వానికి పట్టవా అన్ని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా ఐకీపీ సెంటర్లు త్వరగా ప్రారంభించి రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు నేపథ్యంలో పిఎసిఎస్సి, ఐకెపి సెంటర్లో పోసిన ధాన్యం కొట్టుకపోవడంతో రైతన్నల ఆవేదన ఆరమ్మ గోశంగా మారింది.

కట్టంగూర్ మండల పరిధిలో ఐటిపాముల గ్రామం వరి ధాన్యం అధికంగా దిగుబడి చేస్తున్న నేటికీ ఇక్కడ వ్యవసాయ మార్కెట్ లేకపోవడంతో వర్షాకాలం వచ్చిందంటే తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు  మహేష్,సైదిరెడ్డి, సైదులు, సతీష్,సురేందర్‌ఆరోపిస్తున్నారు.

నాలుగు ఎకరాల అప్పు చేసి మరి కౌలుకు చేస్తే 8 టక్కుల వరి ధాన్యం వస్తే అందులో ఒక ఎకరం ఒడ్లు మాత్రమే మిగిలినవి కొట్టుకుపోయిన వడ్లకు ఆర్థిక సాయం అందజేయాలని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం శాశ్వత మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని ధాన్యం తేమశాతం 17 వచ్చిన గాని ఎటువంటి కటింగ్ లేకుండా తక్షణమే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.