calender_icon.png 10 October, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయపెడుతున్న గ్రామసింహాలు!

10-10-2025 01:09:34 AM

-కుక్క కాటుకు గురవుతున్న బాధితులు

- ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

కొండాపూర్, అక్టోబరు 9 :కొండాపూర్ మండలంలో రోజురోజుకు కుక్కల బాధ పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవు తున్నారు. కుక్కల వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెలదీస్తున్నారు. పాఠ శాలకు వెళ్ళే విద్యార్థులు తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎక్కడ కుక్కల కాటుకు గురవుతారోనని తల్లిదండ్రులు భయాందోళనకు గుర వుతున్నారు. పిల్లలు ఇంటికి రాగానే హమ్మ య్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

కుక్కల బెడద నుంచి కాపాడాలని ఎన్నోసార్లు ఆయా గ్రామ పంచాయతీల సెక్రటరీ లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కుక్కలను గ్రామాల నుంచి తొలగించకుండా కాలయాపన చేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఎక్కడైనా కుక్కల మంద కనబడితే అయ్య బాబోయ్ కుక్కలు అంటూ పరుగులు తీస్తున్నారు. వివిధ ప్రాంతాలలో కుక్కల బారిన చిన్న చిన్న పిల్లలు బలవుతున్నారని వార్త తెలుసుకున్న ప్రజలు తమ పిల్లలకు ఎలాంటి ఉపద్రవం వచ్చి పడుతుందోనని ప్రతిరోజు కుక్కల గురించే మాట్లా డుకుంటున్నారు.

కొండాపూర్ మండల పరిధిలోని సైదాపూర్ గ్రామంలో కుక్కల దాడి నివారించాలంటూ ప్రజలు అధికారులకు విన్నవించుకుంటున్నారు. కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటు ప్రజా ప్రతినిధులు గాని అటు అధికారులు గానీ కుక్కలు నివారించడంలో విఫలమవుతున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. 

పట్టించుకోని పంచాయతీ సిబ్బంది..

గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రమవుతున్నా, పలువురు కుక్కకాటుకు గురవుతు న్నా పంచాయతీ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా కనీస చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీధి కుక్కల కుటుంబ నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో పెరిగిపోతు న్న వీధి కుక్కల సంఖ్యను తగ్గించి వాటి భారినుంచి తమ పిల్లలను కాపాడాలని తల్లిదం డ్రులు వేడుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం..

గ్రామాల్లో వీధి కుక్కల నియంత్రణ కు చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో కు క్కల బెడద లేకుండా చూసేలా కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తాం. గ్రామంలో ఎవరు కూడా కుక్కలను చంపవద్దు.

కె.వేణుగోపాల్, ఎంపీడీవో, కొండాపూర్