calender_icon.png 8 November, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రైవేటు’కే నిబంధనలా?

08-11-2025 12:00:00 AM

  1. ప్రైవేటు వాహనాలకు జరిమానాలు                              
  2. ప్రభుత్వ, ఆర్టీసీ వాహనాలకు మినహాయింపు లెందుకు              
  3. చోద్యం చూస్తున్న ఆర్‌టీఏ, పోలీస్ అధికారులు                      
  4. రోడ్డు ప్రమాద బాధితునికి ఎక్స్‌గ్రేషియా అందించాలి                   

నిజాంసాగర్, నవంబర్ 7 (విజయక్రాం తి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టం ప్రకారం ఆర్టిఏ, పోలీస్ అధికారులు అధిక లోడుతో ప్రయాణించే వాహ నాలకు జరిమానాలు విధిస్తూ వాహనాలను సైతం జప్తు చేస్తున్నారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బస్సు ప్రమా దం లో 19 మంది ప్రయాణికులు మృతి చెంద గా ఆర్‌టీఏ అధికారులు హడావుడి చేస్తూ ప్రైవేటు బస్సులపై కొరడా ఝళిపించారు..

నిబంధనలు ప్రైవేటు వాహనాలకేనా..

ప్రైవేట్ వాహనాలపై తరచూ కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేసే అధికారులు  ఆర్టీసీ బస్సుల పై ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం  మిస్మయానికి గురిచేస్తుంది. 50 మంది ప్రయాణికుల కెపాసిటీ గల బస్సులో 70 నుంచి 80 మంది వరకు ప్రయాణికులను చేరవేస్తున్న ఆర్టిఏ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.. 

ద్విచక్ర వాహనదారునికి కనీసం హెల్మెట్ లేకుంటేనే చలానా వేస్తున్న పోలీసులు  ఆర్టీసీ బస్సు డ్రైవర్‌లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా, మొబైల్ ఫోన్ వాడుతున్న వారిపై ఎలాంటి చలాన్లు విధించిన సందర్భాలు లేవు. దీనికి తోడు రహదారులపై ఎక్కడపడితే అక్కడ నడిరోడ్డు పైన వాహనాలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వెనుక నుంచి వచ్చే వాహనాలు ప్రమాదానికి గురైన సంఘటనలు అనేకం ఉన్నాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారంప్రైవేటు ప్రభుత్వ వాహనాలకు ఒకే నిబంధన వర్తిస్తాయి . ఇవేమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తుండంతో  ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనల ప్రకారమే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులను చేరవేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

ప్రతి రోడ్డు ప్రమాద బాధితులందరికీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి..

రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలనీ ప్రజలు కోరుతున్నారు. పెద్ద పెద్ద ప్రమాదాల్లో అధిక మొత్తంలో మరణిస్తేనే ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాయని ప్రతినిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఒకరిద్దరు  ప్రమాదానికి గురై మరణిస్తే వారిని పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలు ఎలా రోడ్డున పడతాయో చిన్న ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు అదేవిధంగా రోడ్డున పడతాయని అలాంటివారిని ప్రభుత్వాలు ఆదు కొని ఎక్స్గ్రేషియా అందించాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ప్రైవేటు వాహనాలకు ప్రభుత్వ వాహనాలకు ఒకే నిబంధన ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.. 

.ప్రజా రవాణాకు అవసరమైన వాహనాలను ప్రభుత్వాలు సమకూర్చాలి.  ప్రజారవాణాకు అవసరమై న వాహనాలను సమకూర్చుకొని రవాణా వ్యవస్థను కల్పించాల్సిన ప్రభుత్వాలు సరైన రవాణా వ్యవస్థను కల్పించడంలో విఫలం కావడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నయని విమర్శిస్తున్నారు. 

కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప మారలేరా..

ఆర్టీసీ బస్సుల్లో స్థాయికి మించి ప్రయాణికులను చేర వేస్తుండడంతో ఇట్టి విషయ మై కోర్టులు సుమోటోగా జోక్యం చేసుకుంటే తప్ప  ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేరు అనేది అర్థమవుతుంది. చేవెళ్ల బస్సు ప్రమాదం తర్వాత ఏ ఒక్క ప్రభుత్వ అధికారి ఆర్టీసీ బస్సులను తనిఖీ చేసిన పాపను పోలేదు వ్యవస్థను ఇలాగే వదిలేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే.