calender_icon.png 4 December, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నువ్వా.. నేనా..?

04-12-2025 12:50:39 AM

కుర్చీ కోసం సవాల్ ప్రజల తీర్పేది..?

గోపాలపేట డిసెంబర్ 3: గోపాలపేట సర్పంచ్ పదవి కోసం నువ్వా నేనా అంటూ సవాల్ విసురుకుంటూ రంగంలోకి దూకుతున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ కుర్చీ కోసం పోటాపోటీగా నడుస్తున్నాయి. గోపాలపేట కు జనరల్ మహిళా రిజర్వేషన్ వచ్చింది. గోపాలపేట సర్పంచి పదవి కోసం మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎర్ర పోగుల సువర్ణ నామినేషన్ వేయగా బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి  కర్రోళ్ల స్వప్న భాస్కర్ నామినేషన్ వేశారు. మూడవ అభ్యర్థి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బుల్లెద్దుల పద్మ బాలరాజ్ లు నామినేషన్లు వేశారు.

బుధవారం నామినేషన్ల ప్రక్రియలో పద్మ బాలరాజు విత్ డ్రా చేసుకున్నారు. నేడు జరిగే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులే రంగంలో ఉన్నారు. ఎవరికివారు గుట్టు చప్పుడు కాకుండా సర్పంచ్ కుర్చీ కోసం పోటాపోటీగా నువ్వా నేనా కుర్చీ కైవసం కోసం విజయం పతాకం ఎవరు ఎగరేస్తారు వేచి చూడాల్సిందే. ఓ పక్క క్రమశిక్షణ అంటూ మరోపక్క సేవాభావం అంటూ రంగంలోకి దిగారు. మరి గోపాలపేట ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఓట్ల లెక్కింపు వరకు ఎదురుచూడాల్సిందే.