calender_icon.png 25 September, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలిండియా పోటీలకు ఎంపికైన ఏరియా క్రీడాకారులు

24-09-2025 11:05:16 PM

మందమర్రి,(విజయక్రాంతి): వర్క్ పీపుల్ స్పోర్ట్స్ & గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంపెనీ స్థాయి వార్షిక పోటీల్లో ఏరియా కార్మిక క్రీడాకారులు పాల్గొని క్రీడల్లో ప్రతిభ కనబరిచి కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఏరియా జీఎం ఎన్.రాధాకృష్ణ తెలిపారు. బుధవారం భూపాలపల్లి మినీ ఫంక్టన్ హాల్ లో నిర్వహించిన కంపెనీ స్థాయి బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఏరియా కు చెందిన బత్తుల వెంకట స్వామి ఈఎఫ్ఎం ఏరియా వర్క్ షాప్, బాడీబిల్డింగ్ (95 కేజీ ల విభాగం), బెల్లం అరుణ్ పంప్ ఆపరేటర్, కాసిపేట్-1, వెయిట్ లిఫ్టింగ్  (79 కేజీల విభాగం)లో గోల్డ్ మెడల్స్ సాధించి కోల్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. కోలిండియా పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్  రాజేశ్వర్ రెడ్డి పతకాలు అందజేశారు.

కాగా కోలిండియా పోటీలకు ఎంపికైన ఏరియా కార్మిక క్రీడాకారులను జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ, ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్ లు ప్రత్యేకంగా  అభినందించి, కోలిండియా పోటీల్లో అత్యద్భుత ప్రతిభ కనబరిచి ఏరియా పేరును నిలబెట్టాలని కోరారు.