calender_icon.png 25 September, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార సదస్సు

24-09-2025 11:01:30 PM

నంగునూరు: గర్భిణులు, బాలింతలు, యువతిలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రజిత సూచించారు. పోషణ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం నంగునూరులోని అంగన్‌వాడీ సెంటర్-1లో పోషకాహార సదస్సును నిర్వహించారు. శరీరానికి కావాల్సిన పోషకాలు లభించాలంటే రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్, బీట్‌రూట్, మొలకెత్తిన గింజలు, పాలు, తృణధాన్యాలను చేర్చుకోవాలని ఆమె సూచించారు. తరచుగా గుడ్లు, మాంసం, చేపలు తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్లు అందుతాయని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ సిబ్బంది బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.