calender_icon.png 21 November, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్రెయిన్‌పై మళ్లీ రష్యా దాడులు

21-11-2025 12:00:00 AM

  1. ముగ్గురు పిల్లలు సహా 26 మంది మృతి
  2. పశ్చిమ నగరమైన టెర్నోపిల్‌లో రెండు ఫ్లాట్లపై డ్రోన్, క్షిపిణిలతో దాడులు
  3. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం.. శిథిలాల్లో చిక్కిన బాధితులు

కైవ్, నవంబర్ 20: ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన డ్రోన్, క్షిపిణి దాడుల్లో 26 మంది మరణించగా, దాదాపు 100 మంది త్రీవం గా గాయపడ్డారు. పశ్చిమ ఉక్రెయిన్‌పై రష్యా చేసిన అత్యంత దారుణమైన దాడుల్లో 26 మంది సహా పిల్లలు సహా మృతి చెందారు. ఉక్రెయిన్‌లోని  పశ్చిమ నగరమైన టెర్నోపిల్‌లలో రెండు ఫ్లాట్లపై రష్యా క్షిపణి, డ్రోన్ దాడిలో ముగ్గురు పిల్లలు సహా కనీసం 26 మంది మరణించారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో మరో 93 మంది గాయపడ్డారని, వారిలో 18 మంది పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. - ఫిబ్రవరి 20 22లో మాస్కో పూర్తిస్థాయి దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఈ ప్రాంతంలో అ త్యంత ఘోరమైన దాడుల్లో ఇది ఒకటి. రష్య న్ ఎక్స్-101 క్రూయిజ్ క్షిపణులు నివాస ఫ్లాట్లను తాకినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. పొరుగున ఉన్న లివివ్, ఇవానో-ఫ్రాంకివస్క్ ప్రాంతాలు కూడా దెబ్బ తిన్నాయి.

ఈశాన్య నగరమైన ఖార్కివ్లోని మూడు జిల్లాలపై జరిగిన డ్రోన్ దాడిలో 30 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ వై మానిక దళం 476 డ్రోన్లలో 442 రష్యా ప్ర యోగించిన 48 క్షిపణులలో 41 క్షిపణులను కూల్చివేసిందని, వీటిలో 10 క్షిపణులను ఎఫ్16,  మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయని తెలిపింది.

ప్రస్తుతం ఉక్రెయిన్ వైమానిక రక్షణ ఎంత విస్తరించి ఉందో ప్రస్తావిస్తూ, వైమానిక దళం ‘పాశ్చాత్య భాగస్వాముల నుంచి విమాన ఆయు ధాలను నిరంతరాయంగా  సకాలంలో సరఫరా చేయాలని కోరింది. రాజధాని కైవ్ కం టే పోలిష్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న టెర్నోపిల్ నగరం, పూర్తి స్థాయి దాడి త ర్వాత చాలా అరుదుగా దాడులను ఎదుర్కొంది.