calender_icon.png 9 July, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాలకు పక్కగా ఏర్పాట్లు

25-06-2025 01:32:56 AM

-కార్వాన్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ 

కార్వాన్, జూన్ 24: బోనాల పండుగకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని కార్వాన్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ తెలిపారు. మంగళవారం ఆమె గోల్కొండ జగదాంబికా ఆలయ ట్రస్టీ కమిటీ చైర్మన్ చంటిబాబు, ఇతర కమిటీ సభ్యులతో కలిసి లంగర్ హౌస్‌లో ఏర్పాటు చేయనున్న మంత్రుల స్వాగత సభా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించారు.

అక్కడ పైప్ లైన్ పనులు జరగడంతో మ్యాచ్ వర్కులు పూర్తి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గోల్కొండ కోటలో ఇప్పటికే జిహెచ్‌ఎంసి పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగుల పల్లి శ్రీకాంత్, సంతోష్ గౌడ్, ఆకుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.