08-07-2025 11:52:11 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెరగని ముద్రవేశారని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో వైఎస్‌ఆర్ చిత్రపటానికి సీఎం రేవంత్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్‌రింగ్‌రోడ్డు, పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాలతో ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయారని సీఎం కొనియాడారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలని వైఎస్ చెప్పేవారని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.