calender_icon.png 9 July, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

09-07-2025 12:35:47 AM

 ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

యాచారం జులై 8 : కాంగ్రెస్ ప్రజా పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి భరోసా కల్పించారు. అభివృద్దే ధ్యేయం గా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలో ని కొత్తపల్లి, తక్కల్లపల్లి, నందివనపర్తి, సింగారం, అయ్యవారిగూడెం, యాచారం, గ్రామాలలో ఆయ న పర్యటించి రూ. 1.89 కోట్ల రూపాయలతో అండర్ డ్రైనేజ్, సిసి రోడ్ల పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు.అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఆయా గ్రామాల తమకి ఇందిరమ్మ ఇండ్లు, పలు సంక్షేమ పథకాలు అందుతా లేదా అని ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు.

దీనికి స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసి అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారికి సూ చించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మస్కు నరసింహ, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి , బిఎన్‌ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు లిక్కి రాజారెడ్డి , వరికుప్పల సుధాకర్ , మహమ్మద్ రన్ని, తదితరులు పాల్గొన్నారు.