calender_icon.png 9 July, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ నాయకుడు ‘అల్ఫోర్స్’ నరేందర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

09-07-2025 12:34:35 AM

కొత్తపల్లి, జులై 08(విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులు, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత, వి ఎన్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి. నరేందర్ రెడ్డిజన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తెలంగాణ చౌక్ లో జిల్లా యువజన కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో భారీ కేకు ఏర్పాటుచేసి కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో అంధుల పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం పండ్లు & చాక్లెట్ల పంపిణీ చేశారు.ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో నగర శివారులోని ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్లో అన్నదానం నిర్వహించారు.

బీసీ విద్యార్థి సంఘం వారి ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.మహిళా కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించా రు.యువజన సంఘాల వారి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు.నగరంలోని వివిధ కాలనీలలో అభిమానులు, కాలనీవాసులు నరేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులు తేవడమే కాకుండా విద్యారంగంలో అనేక సంచలనాత్మక ఫలితాలు సాధి స్తూ ఎంతోమంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తునందిస్తూ విద్యా ప్రపంచానికి మార్గదర్శకులుగా ఉంటున్నారనిఅన్నారు.