calender_icon.png 9 July, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రహారం అంజన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

09-07-2025 12:36:08 AM

- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

- రాజన్న, అంజన్న ఆలయాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు.

- 150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి.

హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝ.

రాజన్న సిరిసిల్ల: జూలై 8 (విజయక్రాంతి); జిల్లాలోని వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ఆంజనేయ స్వామి ఆలయం & వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వం విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  స్పష్టం చేశారు.

వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో మార్బల్ ఫ్లోరింగ్ పనులు34.50 లక్షల సాండ్ ఫండ్ మంజూరు చేసి మంగళవారం రోజున భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ హాజరై శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.