calender_icon.png 8 July, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేయాలి

08-07-2025 02:01:25 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

సూర్యాపేట, జూలై 7 (విజయక్రాంతి) : నూతన రేషన్ కార్డులు ప్రారంబించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14న తిరుమలగిరికి  వస్తున్నందున ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సి యం పర్యటనకి సంబంధించి అధికారులకి కేటాయించిన భాద్యతలు సక్రమంగా నిర్వహించి పర్యటనని విజయవంతం చేయాలన్నారు. అలాగే అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులలో భూ సమస్యల పై 47, ఎంపిడిఓ లకి 13, డి పి ఓ 10, వివిధ శాఖలకు  సంబందించి 25 మొత్తం 95  ధరఖాస్తులు వచ్చాయన్నారు.

వాటిని పరిష్కరించేందుకు సంబందిత అధికారులకి పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ వివి అప్పారావు,  డి పి ఓ యాదగిరి, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డి ఈ ఓ అశోక్, సి పి ఓ కిషన్, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస నాయక్, జగదీశ్వర్ రెడ్డి, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.