24-05-2025 12:25:11 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, మే 23 : ఈనెల 25న నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న గ్రామ పాలనాధికారుల స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 276 మంది ఈ స్క్రీనింగ్ పరీక్షకు హాజరుకానున్నారని ఆమె వెల్లడించారు ఈ పరీక్షల నిర్వహణకు ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ నోడల్ అధికారిగా వ్యవహరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
అభ్యర్థులు ఉదయం 09:00 గంటలకు పరీక్షా కేంద్రానికి హాజరుకావలెను.ఉదయం 10:00 గంటల తరువాత ఏ అభ్యర్థికైనా పరీక్ష కేంద్రంలో ప్రవేశం అనుమతించబడదు. పరీక్ష సమయం: ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 01:30 వరకు.అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ను ముందుగా డౌన్లోడ్ చేసుకొని, అందులో పేర్కొన్న సూచనలను పూర్తిగా చదివి రావాలి.
హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలి. ఒక పాస్ పోర్ట్ సైజు ఫోటో హాల్ టిక్పె అంటించి, మరో ఫోటో నామినల్ రోల్ కోసం తీసుకురావాలి.అభ్యర్థులు బాల్పాయింట్ పెన్ తప్పనిసరిగా తీసుకురావాలి.ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు అనుమతించబడవు. తాగునీటి సీసా మాత్రమే అనుమతించబడుతుంది.