calender_icon.png 8 January, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనవరి 8న మధ్యాహ్న భోజన కార్మికుల (సీఐటీయూ) కలెక్టరేట్ ముట్టడి

06-01-2026 07:11:39 PM

గుండాల,(విజయక్రాంతి): జనవరి 8న కలెక్టరేట్ ముట్టడిని తలపెట్టనున్న నేపథ్యంలో మండల ఎంఈఓ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్న భోజన కార్మికుల(సీఐటీయూ) ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది ఈసం రాజశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుందని, తదితర సమస్యలపై జనవరి 8న తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిని మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ వజ్జా సుశీల, మండల కో కన్వీనర్ పాయం సారమ్మ, సీఐటీయూ మండల అధ్యక్షురాలు ఎండీ నజ్మా, మధ్యాహ్న భోజన కార్మికులు మంగమ్మ, దుగ్గి ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.