calender_icon.png 16 September, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎంపీ వైద్యం వికటించి విద్యార్థిని మృతి

16-09-2025 12:40:08 AM

కోదాడ సెప్టెంబర్ 15: ఆర్‌ఎంపి వైద్యం వికటించి విద్యార్థిని మృతి చెందిన ఘటన చిలుకూరు మండల పరిధిలోని బేతవోలు గ్రామంలో జరిగింది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన సుహాన (14) మూడు రోజుల క్రితం జ్వరం కారణంగా హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి, అమ్మమ్మ స్వగ్రామం బేతవోలులో స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్ వద్ద చూపించారు.

సోమవారం సైతం జ్వరం తీవ్రంగా ఉండడంతో ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లారు. ఆర్.ఎం.పి ఇంజక్షన్ ఇవ్వడం తో కడుపు వికారంగా ఉందని చెప్పడంతో మరో ఇంజక్షన్ ఇచ్చారని దీంతో నోటి నుండి నూర్జు వచ్చిందని తెలిపారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో జ్వరానికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని రమ్మని చెప్పడంతో కోదాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చామని, పరీక్షలకు సంబంధించిన టెస్టులన్నీ డాక్టర్‌కు చూపించగా ఎక్కువ మోతాదులో ఇంజక్షన్ ఇవ్వడం వల్ల విద్యార్థిని తలనొప్పి, పిట్స్ వచ్చి మృతి  చెంది ఉండొచ్చని వైద్యులు  అభిప్రా యం వ్యక్తం చేశారు అన్నారు. కాగా మృతదేహంలో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి లోనీ మార్చరీలో ఉంచారు.