calender_icon.png 20 September, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బచ్ పన్ లో విజయదశమి, బతుకమ్మ సంబరాలు

20-09-2025 06:08:28 PM

అమీన్ పూర్,(విజయక్రాంతి): విజయదశమి సందర్భంగా బీరంగూడ లోని బచ్ పన్  అకాడమిక్ హైట్స్ స్కూల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలో విద్యార్థుల నృత్యాలు, బతుకమ్మ, దసరా పండుగల గురించి వారు చేసిన ప్రసంగాలు ఎంతగానో అలరించాయి. ఈ వేడుకలలో బాగంగా మహిళలు తాము చేసిన బతుకమ్మలను ప్రదర్శించి, దాండియా ఆటలు ఆడారు. బతుకమ్మ పోటీలో గెలువ గెలిచిన మహిళలకు డైరెక్టర్ సి.హెచ్ శ్రీనివాసరావు, ఆర్. శిరీషారెడ్డి  బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సి.హెచ్ (శ్రీనివాసరావుగారు తెలంగాణ ప్రజల అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా పండుగల విశిష్టతలను గురించి వివరిస్తూ ప్రసంగించారు.