calender_icon.png 13 August, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ నగర్ లో దొంగల బీభత్సం

12-08-2025 10:12:15 PM

జగదేవపూర్: జగదేవపూర్ మండల పరిధిలోని నిర్మల్ నగర్ గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లో చొరబడి 5 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. జగదేవపూర్ ఎస్సై కృష్ణారెడ్డి(SI Krishna Reddy) తెలిపిన వివరాల ప్రకారం, మండల పరిధిలోని నిర్మల్ నగర్ గ్రామానికి చెందిన కర్రే మాధవి ఆదివారం తన అన్నకు రాఖీ కట్టడానికి వేరే గ్రామానికి వెళ్ళింది. ఇంట్లో ఎవరు లేనిది గమనించిన దొంగలు మాధవి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చోరబడి బీరువా పగుల గొట్టి రూ. 5 లక్షలు దొంగిలించారు.

మంగళవారం ఊరి నుండి ఇంటికి వచ్చిన మాధవి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో భయపడి ఇంట్లోకి వెళ్లి పరిశీలించింది. బీరువా పగలగొట్టి దొంగలు డబ్బులు దోచుకెళ్లినట్లు గుర్తించి జగదేవపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్  టీంలు ఆధారాలు సేకరించింది . బృందాలుగా ఏర్పడి నిందితులకోసం గాలిస్తున్నామని,  త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్సై కృష్ణారెడ్డి వెల్లడించారు.