calender_icon.png 13 August, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులందరూ ప్రధాన కార్య స్థానంలోనే ఉండాలి

12-08-2025 10:09:10 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా తమ ప్రధాన కార్య స్థానంలోనే ఉండాలని, పోలీస్, రెవెన్యూ సహా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో(In-charge Collector Lenin Vatsal Toppo), ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్(SP Sudhir Ramnath Kekan) ఆదేశించారు. వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి, పశు సంపద, ఇతర ఎలాంటి విపత్తులను జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్డిఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ కె .అనిల్ కుమార్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి ఇంచార్జీ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ  ఆదేశాలను అన్ని శాఖల అధికారులు పాటించాలన్నారు. 

గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతీ శాఖ అధికారులు వారి  పరిధిలో గల విధులు  నిర్వర్తించాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవన్నారు. కల్వర్టుల వద్ద, చెరువులు తెగే పరిస్థితి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాస్థాయి అధికారి నుండి గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రెటరీ వరకు ప్రధాన కార్య స్థానాన్ని వదిలి వెళ్ళకూడదని, వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాల వద్ద తగిన జాగ్రత్త లు తీసుకోవాలని, విద్యుత్ పోలీస్ సంబంధిత సిబ్బంది వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని, ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ప్రమాద స్థాయిలో ప్రవహించే చెరువులు, కుంటల పరిధిలోకి ఎవరు వెళ్లకుండా చూడాలని, వర్షాల సీజనల్ వ్యాధులు విష జ్వరాలు, వైరల్ ఫీవర్ లాంటి వ్యాధుల ప్రబల కుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరూ ప్రధాన కార్య స్థానం మెయింటైన్ చేస్తే ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చని, తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందని, అన్ని విభాగాలతో పాటు రైల్వే శాఖ అధికారులు సమన్వయం తీసుకోవాలని, గత ఏడాది అనుభవాలను దృశ్య అధికారులు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ముందస్తుగా అదనపు సిబ్బందిని నియమిస్తూ లైఫ్ జాకెట్లు, ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలని, వాతావరణ శాఖ మార్పుల పై అనవసరంగా తప్పుడు వార్త కథనాలను ప్రచురించకూడదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.