12-08-2025 10:14:09 PM
సిద్దిపేట క్రైమ్: ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత(Writer Anisetty Rajitha) మృతిపై మంజీర రచయితల సంఘం నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మంజీర రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు కె.రంగాచారి, సిద్దెంకి యాదగిరి, అలాజ్ పూర్ శ్రీనివాస్, కె.అంజయ్య, తోట అశోక్, పొన్నాల బాలయ్య, భగవాన్ రెడ్డిలు రజిత మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె రచనల ద్వారా సమాజానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని కొనియాడారు.