14-09-2025 12:57:43 AM
బీజేపీ రాష్ర్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సమయానికి యూరియాను అంది ంచడంలో విఫలమైందని, ఎరువుల కృత్రి మ కొరతను సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర ము ఖ్య అధికార ప్రతినిధి సుభాష్ శనివారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. రైతులు రోజూ యూరియా కోసం కేంద్రాల వద్ద క్యూలైన్ల లో వేచిచూసినా, కొంతమంది ఖాళీ చేతులతోనే వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు రాష్ర్ట ప్రభుత్వం సరిపడా యూ రి యా నిల్వలు ఉన్నాయని చెబుతున్నా, మరోవైపు రైతులకు ఎందుకు ఇబ్బందులు తలె త్తుతున్నాయని ప్రశ్నించారు. తెలంగాణలో 2024-25 రబి సీజన్ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉం డగా, కేంద్ర ప్రభుత్వం 12.02 లక్షల మెట్రిక్ టన్నులను పంపిందని, ఇది అవసరానికి మించి 3 లక్షల టన్నులు కాగా, ఆ యూరి యా ఎక్కడికి పోయిందో సీఎం సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు.
అదనంగా వచ్చిన యూరియా మాయమైందా, లేక బ్లా క్ మార్కెట్‌కి వెళ్లిందా అని ప్రశ్నించారు. కాం గ్రెస్ ప్రభుత్వం రైతులు తమ పంటలకు ప్రా థమికంగా అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో అసమర్థంగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రైతులు ఎక్కడిక్కడ నిలదీస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే యూరియా నిల్వల వివరాలను వెల్లడించి, నిల్వలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.