13-08-2025 01:22:39 AM
మలక్‌పేట, ఆగస్టు 12 (విజయక్రాంతి): విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ శాఖ అర్టిసజన్ ఉద్యోగి విద్యుత్ షాక్‌కు గురై మర ణించిన సంఘటన మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అత్తాపూర్ కు చెందిన అంజద్ ముసారాంబాగ్ విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆర్టిసన్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు.
విధి నిర్వహణలో భాగం గా సోమవారం రాత్రి స్థానికుల నుంచి అం దిన ఫిర్యాదు లో భాగంగా మూసారాంబాగ్ శాలివాహన నగర్ లో 11 కె.వి విద్యుత్ లైన్ స్తంభం ఎక్కి విద్యుత్ వైర్లను సరిచేస్తుండగా, అంజద్ స్తంభం పై ఉన్న విషయాన్ని గమనించకుండా విద్యుత్ సరఫరాను ఆన్ చేయడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై కింద పడిపోయాడు.
దీంతో తీవ్ర గాయాలకు గురైన అతడిని చికిత్స నిమిత్తం మలక్‌పేట్ యశోద ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృ తదేహాన్ని యశోద ఆసుపత్రిలో ఉంచగా, సమా చారం తెలుసుకున్న మలక్ పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఆసుపత్రికి చేరుకుని జరిగిన సంఘటన గురించి విద్యుత్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాగా విద్యుత్ సరఫరాను ఆన్ చేసింది ఎవరినే విషయం గురించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.