calender_icon.png 20 September, 2025 | 8:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్ఐవిపై కళాకారుల ప్రదర్శన

20-09-2025 06:34:04 PM

మిడ్జిల్:  జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికాంత్ ఆధ్వర్యంలో వెన్నెల కల్చరల్ అకాడమీ కళాకారులు శనివారం  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర మరియు మిడ్జిల్ బస్టాండ్ దగ్గర హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణపై కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో కళాకారులు పల్లె శుద్ధుల ద్వారా ప్రజలకు హెచ్ఐవి పట్ల హెచ్ఐవి సోకే మార్గాలను వివరించారు. హెచ్ఐవి కలుషిత సూరది, సిరంజిల ద్వారా కలుషితమైన రక్తమార్పిడి ద్వారా అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల హెచ్ఐవి సోకిన తల్లి నుండి బిడ్డకు సోకుతుందని అవగాహన కలిగించారు.

హెచ్ఐవి రాకుండా యువతి యువకులు పెళ్లికి ముందు బ్రహ్మచర్యం పాటించాలని పెళ్లి తర్వాత భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకంగా జీవించాలన్నారు.  అనుకోని పరిస్థితుల్లో అసురక్షిత లైంగికంగా పాల్గొనాలంటే కండోమ్ వాడాలని సూచించారు. హెచ్ఐవి పట్ల ఏమైనా అనుమానాలు ఉంటే  1097 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి అనుమానాలు తీర్చుకోవాలన్నారు.. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్స్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు,వెన్నెల కల్చర్ల అకాడమీ డైరెక్టర్ రవిశంకర్, టీం లీడర్ నరసింహ, చెన్నయ్య ,వెంకటేష్ ,ఝాన్సీ, ఎమ్మాడిస్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు  సుధాకర్ , సుజాత తదితరులు పాల్గొన్నారు.