20-09-2025 06:33:32 PM
స్టెల్లా మేరీస్ స్కూల్ ప్రిన్సిపాల్ సుమలత..
బూర్గంపాడు (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతిలో పూలను గౌరవించడం అంటే బతుకమ్మను ఆరాధించడంలోనే మహిళా శక్తిని గౌరవించడం ఉందని స్టెల్లా మేరీస్ స్కూల్ ప్రిన్సిపాల్ సుమలత అన్నారు. శనివారం నాడు స్కూల్ ఆవరణంలో విద్యార్థిని విద్యార్థులు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుమలత మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఒక తరం నుంచి మరొక తరానికి అందించాల్సిన బాధ్యత విద్యార్థుల మీద ఉందని చెప్పారు. బతుకమ్మ తెలంగాణలోని కాకతీయ ఓరుగల్లులోనే ప్రాణం పోసుకుందని చెప్పారు. తెలంగాణ సమాజంలో సాంస్కృతిక పునర్ జీవనాన్ని తీసుకురావడానికి సంస్కృతి కీలక భూమి పోషించిందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో లేబద్ధంగా చేసిన నృత్యాలు పాడిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పాఠశాల ప్రిన్సిపాల్ సుమలత సైతం విద్యార్థులు మహిళా అధ్యాపకులు కలిసి ఆటపాటల్లో ఆనందాన్నిభూతిని సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ శరణ్య,నవనీత,స్వాతి,మీనా,సుజాత, శారద,అమల,భార్గవి,కుసుమాంజలి,దివ్య,ఖతీజ,గ్రేసీ,పుల్లయ్య,కౌశిక్,పిఈటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.