19-11-2025 12:10:57 AM
-వరల్డ్ కప్ మెడలిస్ట్‌కు షాక్
-ఫైనల్లో ఐదుగురు భారత బాక్సర్లు
గ్రేటర్ నోయిడా, నవంబర్ 18 : వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ భారత బాక్సర్లు దుమ్మురేపుతున్నారు. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా చాలారోజుల తర్వాత రింగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన అరుంధతి చౌదరి జర్మనీకి చెందిన వరల్డ్ కప్ ట్రిపుల్ మెడలిస్ట్ లియోనియో ముల్లర్‌కు షాకిచ్చింది.70 కేజీల విభాగంలో సెమీఫైనల్‌లో అదిరిపోయే ప్రదర్శన కనబరిచిన అరుంధతి వరుస రౌండ్లలో ఓడించింది. గాయాలతో దాదాపు ఏడాదికి పైగా రింగ్‌కు దూరమైన అరుంధతి చౌదరి అంచనాలకు తగ్గట్టే ఈ మెగాటోర్నీలో రాణిస్తోంది.
జర్మన్ బాక్సర్‌ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆమెతో పాటు మరో నలుగురు భారత బాక్సర్లు ఫైనల్స్‌కు చేరుకున్నారు. 48 కేజీల విభాగంలో మీనాక్షి 5 స్కోర్‌తో కొరియా బాక్సర్ చోరాంగ్‌పై గెలిచింది. అలాగే పురుషుల 80 కేజీల విభాగంలో అంకుశ్ ఫంగల్ 5 స్కోర్ తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన మార్లోన్ సెవోన్‌పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాడు. అలాగే పురుషుల 60 కేజీల విభాగంలో ప్రవీణ్ పోలండ్‌కు చెందిన వరల్డ్ కప్ సిల్వర్ మెడలిస్ట్ అనేటా ఎల్జ్‌బేటాకు షాకిచ్చాడు. ఇక మహిళల 80 కేజీల విభాగంలో నుపుర్ ఉక్రెయిన్‌కు చెందిన మారియాపై గెలిచి ఫైనల్‌కు చేరింది.