19-11-2025 12:08:30 AM
ముంబై, నవంబర్ 18 : డిసెంబర్‌లో భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య జరగాల్సిన వైట్‌బాల్ సిరీస్‌లు వాయిదా పడినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై సస్పెన్స్ నెలకొంది. ఈ కారణంగానే సిరీస్‌ను వాయిదా వేసినట్టు సమాచారం.షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో బంగ్లాదేశ్ మహిళల జట్టు భారత పర్యటనకు వచ్చి 3 వన్డేలు, 3 టీ ట్వంటీలు ఆడాల్సి ఉంది.
మ్యాచ్‌లు తేదీలు ఖరారు కానప్పటకీ కోల్‌కత్తా, కటక్‌లలో నిర్వహించాలని బోర్డు భావించింది. ఇప్పుడు వాయిదా పడడంతో ప్రత్యామ్నాయ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. వేరే క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.ప్రస్తుతానికి బంగ్లాతో సిరీస్ తాత్కాలికంగా వాయిదా పడినట్టేనని, పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించాయి. కాగా వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత్ ఆడబోయే తొలి సిరీస్ ఇదే.