31-12-2025 12:00:00 AM
ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కే లక్ష్మణ్
ముషీరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ లో భారత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బీహారీ వాజపేయి జయంతి సందర్భంగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు చీరలు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొని చీరల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని, మన దేశ పౌరుషాన్ని, పరాక్రమాన్ని, పోరా ట ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన ధీరోదాత్తుడు, భారత రత్న అటల్ బిహారీ వాజపేయి ఆయన101వ జయంతి (సుపరిపాలన దినోత్సవం) వేడుకల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా సికింద్రాబాద్ అధ్యక్షులు జి. భారత్ గౌడ్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, రాజు, పీ. నర్సింగ్ రావు, ఎం. ఉమేష్, సురే ష్ రాజు, శివ కుమార్, ఆనంద్ రావు, శ్రీనివాస్, లక్ష్మణ్ యాదవ్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.