13-07-2025 12:55:53 AM
రామ్‌చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చిబా బు సానా దర్శకత్వం వహిస్తున్నా రు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబా బు, దివ్యేందుశర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇంకా కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కూడా ఈ చిత్రంలో ‘గౌర్నాయు డు’ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నారు.
శనివారం శివరాజ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమాలో ఆయన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటెన్స్ చూపు, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో కనిపించారు శివరాజ్‌కుమార్. కథానాయకుడు రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026, మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ సినిమా. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: రత్నవేలు; ఎడిటర్: నవీన్ నూలి.