13-05-2025 12:33:07 AM
చేవెళ్ల నియోజకవర్గంలో పలువురు బాధితులు..
లక్షల్లో మోసపోతుతున్న అమాయకులు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
అపరిచిత కాల్స్, లింక్స్‌కు స్పందించొద్దని హెచ్చరిక
చేవెళ్ల, మే 12: టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంటే సైబర్ నేరాలు కూడా అదే స్థా యిలో పెరుగుతున్నాయి. ఆన్ లైన్ బ్యాం కింగ్, డిజిటల్ లావాదేవీలు, సోషల్ మీడి యా వాడకం ఎక్కువవుతున్న కొద్దీ.. సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. లోన్స్ యాప్స్, టెలిగ్రామ్, ఇన్ స్టాగ్రామ్.. ఇతర సోషల్ మీ డియా ప్లాట్ఫారమ్స్ ద్వారా అమాయకులకు నిలువునా దోపిడీ చేస్తున్నారు.
సైబరా బాద్ కమిషనరేట్ పరిధిలో 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 970కి పైగా సైబర్ క్రై మ్ ఫిర్యాదులు నమోదయ్యాయంటే నేరా లు సైబర్ నేరగాళ్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇదివరకు నగ రాలకే పరిమితమయ్యే ఈ నేరాలు పట్టణా లు, గ్రామాలకు కూడా పాకుతుండడం ఆం దోళన కలిగిస్తోంది. అయితే పోలీసులు మా త్రం సైబర్ నేరాలపై మీడియా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కళాజాత.. తదితర మార్గాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అపరిచిత కాల్స్, లింక్స్ కు స్పందించవద్దని సూచిస్తున్నారు.
బజాజ్ లోన్ ఎగ్జిక్యూటీవ్‌గా నమ్మించి..
నెల కింద మొయినాబాద్ మున్సిపాలిటీకి చెందిన ఎండీ నయూముద్దీన్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. బజాజ్ ఫైనాన్స్ నుం చి లోన్ ఎగ్జిక్యూటీవ్ గా పరిచయం చేసుకు న్న కేటుగాడు... మీకు రుణం మంజూరు అ య్యిందని, ముందుగా కొంత డబ్బు చెల్లించాలని సూచించారు. నమ్మిన నయూ ము ద్దీన్ రూ.75,130 ఆన్లైన్ ద్వారా పంపించాడు. తర్వాత జీఎస్టీ, టీడీఎస్ కోసం అని మరి కొంత డబ్బు డిమాండ్ చేయడంతో మోసమని గ్రహించిన బాధితుడు సైబర్ ఫోర్ట ల్లో ఫిర్యాదు చేశాడు.
మరో ఘటన లో మున్సిపాలిటీకే చెందిన ఎండీ ఎజాస్.. ఇన్ స్టాగ్రామ్ లో పార్ట్ టైమ్ ఉద్యోగమని నెంబర్ ఇస్తే దానికి కాల్ చేశాడు. దీంతో అతనికి సైబర్ నేరగాళ్లు లింక్ పంపించగా.. వారి సూచనల ప్రకారం రూ.34,421 ఇన్వెస్ట్ చేశాడు. ఆ డబ్బులు తిరిగి రాకపోవడంతో వెంటనే సైబర్ ఫోర్టల్లో ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజుల కింద మొయినాబాద్ పోలీస్ స్టేష నకు పార్వర్డ్ చేయగా .. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డాక్టర్ ను కూడా వదలని మోసగాళ్లు
అమాయకులే కాదు సైబర్ నేరగాళ్ల బా రిన పడి డాక్టర్లు కూడా మోసపోతున్నారు. చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో ఎంబీబీఎస్ పీజీ డాక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ కు కూడా సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు. ఆయనకు ఫిబ్రవరి 10న వాట్సప్లో 8266075602 నెంబర్ నుంచి ‘మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి’ అని మెసేజ్ను వచ్చింది. దీంతో ఆయన ఫాలో అయ్యాడు. కొద్దిసేపటికే అదే నెంబర్ నుంచి తదుపరి సమాచారం కోసం లింక్ క్లిక్ చేయండి అని మరో మెసేజ్ వచ్చింది. క్లిక్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అతని బ్యాంక్ ఖాతా నుంచి రూ. 80,000 కట్ అయిపోయాయి.
విస్తుపోయిన ఆదిత్య వెంటనే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో చేవెళ్ల టీచర్స్ కాలనీలో నివసించే మహిళకు ఆమె స్నేహితులు ఎల్ ఎఫ్ ఎల్ (LFL App) యాప్ లో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పడంతో నమ్మి గత డిసెంబర్ 8న యాప్లో రిజిస్టర్ అయ్యారు. మొదట చిన్న మొత్తం లో డబ్బులు పెట్టగా రెట్టింపు రాబడి వచ్చిం ది. తర్వాత మరింత ధైర్యంతో మొత్తం రూ. 88,623 ఇన్వెస్ట్ చేశారు.
కానీ, జనవరి 3 నాటికి ఆ యాప్ ఆకస్మికంగా మూసివేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ కు ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి చేవెళ్ల పోలీస్ స్టేషన్ కు ఫార్వర్డ్ చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని బాధితులు కొందరు ఫిర్యాదు చేయగా... మరి కొంతమంది తమ పరువు పోతుందని.... ఫిర్యాదు చేయని వారు కూడా చాలామంది బాధితులు ఉంటారని పోలీసులు పేర్కొంటున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల నుంచి వచ్చిన యాప్ లింకులు క్లిక్ చేయడం గాని, టెలిగ్రామ్ ఛానళ్లలో చేరడం గాని చేయవద్దు. యాప్ ల్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టొద్దు. ఎప్పుడైనా అలాంటి సందేశాలు వచ్చినప్పుడు 1930 హెల్ప్లైన్ కు కాల్ చేయాలి. లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.
పవన్ కుమార్ రెడ్డి, మొయినాబాద్ సీఐ