13-05-2025 12:53:13 AM
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీఐ (సమాచా ర హక్కు చట్టం)కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నలుగురిని నియమించిం ది. ఈ మేరకు పీవీ శ్రీనివాసరావు, మోహసిన్ పర్వీన్, దేశాల భూపాల్, సీఎం బోరెడ్డి ఆయోధ్యరెడ్డిలను ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం పలువురి పేర్ల ను ప్రతిపాదిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఫైల్ పంపింది.
రాష్ట్ర ప్రభు త్వం పంపిన పేర్లకు గవర్నర్ ఆమో దం తెలపడంతో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవలనే రాష్ట్ర ప్ర ధాన సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా జీ చంద్రశేఖర్‌రెడ్డిని నియ మిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. వీరు మూడేళ్ల పదవిలో ఉండనున్నారు. కాగా, ఇప్పుడు కమిషనర్లుగా నియమితులైన వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన పీవీ శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టుగా ఉన్నారు.
యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలా నికి చెందిన బోరెడ్డి ఆయోద్యరెడ్డి సీఎం సీపీఆర్వోగా ఉన్నారు. గతం లో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా కూ డా పనిచేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన దేశాల భూపాల్ (ఎస్సీ మాదిగ) న్యాయపరంగా సామాజిక సేవలు చేస్తున్నా రు.
మైనార్టీ కోటాలో మోహసిన్ పర్వీన్‌ను ప్రభుత్వం ఎంపిక చేసిం ది. హైదరాబాద్‌కు చెందిన పర్వీన్ ప్రస్తుతం న్యాయవాదిగా పని చేస్తున్నారు. కాగా, గత రెండేళ్లుగా సమా చార కమిషన్‌లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో దాదాపు 10,688 ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.