13-05-2025 12:29:00 AM
మేడ్చల్, మే 12(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో ఫ్లైఓవర్ పనులు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా చేస్తున్నారని, మురుగు కాలువ పూడ్చివేయడంతో నీరు రోడ్డు మీద ప్రవహిస్తుందని, దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ’విజయ క్రాంతి’దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందన లభించింది.
ఈ నెల 10న’ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం రాజ్యం’శీర్షిక నా కథనం ప్రచురితమైంది. బస్ డిపో వద్ద ఓపెన్ డ్రైవ్ పూడ్చి వేయడం వల్ల మురుగునీరు రోడ్డు మీద ప్రవహించింది.
ఫ్లై ఓవర్ పిల్లర్ నిర్మాణానికి తవ్విన గుంత పూడ్చినప్పటికీ తారువేయనందున దుమ్ము దూళితో, గుంతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు అధికారులు కాంట్రాక్టర్ స్పందించి జెసిబి తో పూడ్చివేసిన డ్రైనేజీని ఓపెన్ చేయించారు. పిల్లర్ నిర్మాణానికి తవ్వినచోట ఒకవైపు రోడ్డుపై తారువేశారు. మరోవైపు తారు వేయాల్సి ఉంది.