calender_icon.png 12 December, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొమ్మిదో తరగతి విద్యార్థినిచే అష్టావధానం

10-12-2025 01:19:31 AM

తెలుగు, సంస్కృత సాహిత్య వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం

ముషీరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): భారతీయ ’సాహిత్య-సాంస్కృతిక’ సంప్రదాయంలో విశిష్ట ఘట్టంగా హైదరాబాద్ లోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని అహలా అయ్యల సోమయాజు అష్టావధానం ప్రదర్శించింది. 14 ఏళ్ల వయసులో అష్టావధానం ప్రదర్శించడం అత్యంత అరుదైన సాధన, వెంకటాద్రి అవధాని, వడ్డిపర్తి పద్మాకర, మేదాసాని మోహన్ వంటి మహానుభావులు మాత్రమే ఈ ఘనతను సాధించారు.

శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, ఎల్చూరి మురళీధర్ రావు, రేవూరి ఆనంత పద్మనాభం, తనికెళ్ళ భరణి, దర్శనం శర్మ, యోగి చెంబోలు, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్ శైలజా రావు, కాంచి పీఠం హనుమంతరావు, డీ.ఆర్.డీ.వో రిటైర్డ్ సైంటిస్ట్ చామర్తి శ్రీనివాస్, రచయిత్రి వెల్పూరి సుజా త, త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వడ్డిపర్తి పద్మాకర్, విద్యారణ్యం వేద పాఠశాల వ్యవస్థాపకులు మడుగుల శశిభూషణ సోమయాజి హాజరై ఆశీర్వదించారు.