10-12-2025 01:20:05 AM
కామారెడ్డి, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం ఆర్ అండ్ బి అధికారులు ఆవిష్కరించారు.12 అడుగుల ఎత్తులో విగ్రహం, బేస్మెంట్ 4 అడుగులు, విగ్రహం కింద ఉండే 2 అడుగుల పీఠం తో కలిపి మొత్తం 18 అడుగుల ఎత్తు కలిగిన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.