09-11-2025 12:00:00 AM
సమస్య పరిష్కారానికి కమిటీ ఏర్పాటు
దుబాయి, నవంబర్ 8 : ఆసియాకప్ ట్రోఫీ వివాదానికి త్వరలోనే తెరపడనుంది. సమస్య పరిష్కారానికై ఐసీసీ జోక్యం చేసుకుంది. వివాదానికి ముగింపు పలికేందుకు కమిటీ ఏర్పాటు చేసింది. ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ వివాదాన్ని బీసీసీఐ లేవనె త్తింది. పీసీబీ చీఫ్, ఏసీసీ చీఫ్‌గా ఉన్న మోసి న్ నఖ్వి వ్యవహరించిన తీరు, తదనంతర పరిణామాలను ఐసీసీ దృష్టికి తీసుకె ళ్లింది.
అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు లు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని బీసీసీఐ, పాక్ క్రికెట్ బోర్డు లకు సూచించాయి. ఐసీసీ పెద్దలు కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పడంతో రెండు దేశా ల బోర్డులు కమిటీ ఏర్పాటుకు అంగీకరించాయి. దీనిలో భాగంగా రెండు దేశాల బోర్డులతో స్నేహపూర్వక సంబంధాలున్న ఒమన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పంకజ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.
దుబాయి వేదికగా జరిగిన ఆసియాకప్ ఫైనల్లో భారత్, పాక్‌ను ఓడించింది. అయితే ఏసీసీ ఛైర్మన్‌గా ఉన్న నఖ్వీ పీసీబీ చీఫ్‌గానే కాకుండా పాక్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో భారత కెప్టెన్ సూర్యకుమార్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నఖ్వీ ట్రోఫీతో పాటు మెడల్స్ తీసుకుని వెళ్లిపోయాడు. త్వరలోనే ఆసియాకప్ ట్రోఫీని భారత్‌కు పంపించే అవకాశాలున్నాయి.