01-10-2025 12:00:00 AM
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ను భారత్ తొమ్మిదోసారి కైవసం చేసుకుంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్ పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు క్రికెటర్ నంబూరి తిలక్ వర్మ తన అద్భుత ఆటతో చివరిదాకా నిలబడి జట్టుకు విజయాన్ని అం దించాడు. ప్రధాని మోదీ సహా రాజకీయ ప్రముఖులు, అభిమానులు సై తం ‘క్రికెట్‌లో పాక్‌పై జరిగిన ఆపరేషన్ సిందూర్‌లోనూ భారత్‌దే వి జయం’ అని కొనియాడారు.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానం లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నే పథ్యంలో ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు.. పాక్ క్రికెటర్లతో కరచాలనం చేయని సంగతి తెలిసిందే. ఫైనల్ అనంతరం అదే వైఖరిని కొనసాగించిన భారత జట్టు ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వి నుంచి ట్రోఫీని అందుకోవడానికి తిరస్కరించింది. అయితే నఖ్వి మాత్రం కప్పును తానే ఇస్తానని పట్టుబట్టాడు.
కానీ అప్పటికే నఖ్వి నుంచి ట్రోఫీని అందుకోదని బీసీసీఐ ముందే ఏసీసీకి స్పష్టంగా తెలియజేసింది. నఖ్వి కిం దకు దిగితేనే తాము కప్పు అందుకుంటామని కెప్టెన్ సూర్యకుమార్ పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్లకు ఇచ్చే వ్యక్తిగత అవార్డులను కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ స్వీకరించారు. అనంతరం ఆసియా కప్ అందుకునేందుకు భారత్ స్టేజీ మీదకు రావడం లేదని ఏసీసీ తనకు చెప్పిందని ప్రెజెంటర్ సైమన్ డౌల్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో పోడియం నుంచి కిందకు ది గిన నఖ్వి కప్పుతో పాటు భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన పతకాలను వెంటబెట్టుకొని మైదానం వీడాడు. దీంతో భారత ఆటగాళ్లు ట్రోఫీ, పతకాలు లేకుండానే సంబరాలు చేసుకోవాల్సి వచ్చింది. నఖ్వి చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, అతడిపై చర్యల కోసం తాము ఐసీసీని సంప్రదించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. నవంబర్ తొలి వారంలో దుబాయ్ వేదికగా ఐసీసీ వార్షిక సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో నఖ్వి చర్యను ఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ లెక్కన నఖ్వి ఏసీసీ అధ్యక్ష పదవికి ఎసరు పడినట్లే. ఇక ఏసీసీ ఛైర్మన్‌గా ఉన్న మోసిన్ నఖ్వి పాక్ మంత్రిగా, పీసీబీ ఛైర్మన్‌గా కూడా ఉన్నాడు. ‘ఆపరేషన్ సిం దూర్’ సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. భారత కె ప్టెన్ సూర్యకుమార్‌పై ఐసీసీకి పాక్ ఫిర్యాదు చేయడం వెనుక మోసిన్ న ఖ్వి హస్తం ఉంది.
అయితే తనపై విమర్శలు వస్తున్న వేళ ఒక కండిషన్‌తో భారత్‌కు ఆసియా కప్ ఇచ్చేందుకు సిద్ధమని పేర్కొనడం గమనార్హం. భా రత క్రికెట్ జట్టు అధికారికంగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే కప్పుతో పాటు ఆటగాళ్లకు మెడల్స్ అందిస్తానని నఖ్వి ‘ఎక్స్’ వేదికగా తెలిపాడు. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇది అసాధ్యమని అందరికి తెలుసు.
ఓటమికి దగ్గరయ్యామని తెలిసి పాక్ ఆటగాళ్లు పరుష పదజాలంతో రెచ్చిపోయారని, కానీ విజయంతోనే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పామని క్రికె టర్ తిలక్ వర్మ స్పష్టం చేశాడు. మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమైన నేపథ్యంలో మన అమ్మాయిల జట్టు కూడా పురుషుల క్రికెట్ బాటలోనే నడవనుంది. బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో అక్టోబర్ 5న పాక్‌తో జరగనున్న లీగ్ మ్యాచ్‌లో హర్మన్ సేన ఆ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చే యకూడదని నిర్ణయించుకుంది. ఈ పరిణామాలతో భారత్, పాక్‌ల మధ్య వైరం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.