calender_icon.png 9 October, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానంతో ప్రాణదానం

01-10-2025 12:00:00 AM

నేడు జాతీయ రక్తదాన దినోత్సవం

రక్తదానం ప్రాణదానంతో సమానం. శస్త్రచికిత్స సమయంలో రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగి న సంఘటనలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక చనిపోయిన వారు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతీ సంవత్సరం అక్టోబర్ 1న ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీ.

1975లో స్వరూప కృష్ణన్, డా.జె.జి.జొలిల చొరవతో రక్తదాన దినోత్సవం ప్రారంభమైంది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానంపై ప్రజలకు, యువతకు అవగాహన లేదు. రక్త దానం చేస్తే నీరసించి పోతామని, బలహీనపడతామనే భయం చాలా మందిలో ఉంది. కానీ అదంతా అపోహ అని వివిధ స్వచ్ఛంద సం స్థలు, రెడ్‌క్రాస్ సంస్థలు వివిధ గ్రామాల్లో, పట్టణాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు.

ప్రతి ఆరోగ్యవంతుడిలో సు మారు 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల్లోపు ఉన్న ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులు. ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకు ఒకసారి.. సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయొచ్చు. అయితే 45 కిలోల బరువు పైన ఉన్న వారు మా త్రమే రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక వ్య క్తి నుంచి 350 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారు.

రక్తదానం చేసిన వారికి 21 రోజుల్లో పూర్తిస్థాయిలో తిరిగి రక్తం ఉత్పత్తి అవుతుంది. రక్తంలో మొత్తం ఎనిమిది గ్రూపులుంటే అందులో నాలుగు నెగటివ్.. మరో నాలుగు పాజిటివ్ గ్రూపులు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఓటూవూ 35 శాతం, ఓఘూ 13 శాతం, ఏఘూవూ 30 శాతం, బిఘూవూ 8 శాతం, ఏఘూ 8 శాతం, బిఘూ శాతం, ఏబి నెగిటివ్ ఒక శాతం, ఏబీ పాజిటివ్ 2 శాతంగా ఉన్నారు.

ఇక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెడ్ క్రాస్ సంస్థ, ఆయా జిల్లాల ఆస్పత్రులకు అనుబంధ కేంద్రాల్లో అధిక సంఖ్యలో రక్తాన్ని సేకరిస్తున్నాయి. ప్రతి ఏటా వందలాది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలలో రక్తదాన కేంద్రాలు ఉన్నాయి. అనేక మంది బ్లడ్ బ్యా ంకుల ద్వారా రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకుంటున్నారు.

అయితే ఇటీవలే ప్రైవేటు బ్లడ్ బ్యాంకులలో కల్తీ రక్తం విక్రయాలు పెరిగిపోతున్నాయి. అంతేకాదు రెడ్ క్రాస్, ప్రభుత్వ రక్త నిధి కేంద్రాలు అక్రమంగా రక్తాన్ని విక్రయిస్తున్నట్టు సమాచారం. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించాలి.

రక్తదాన విషయంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు.. కరపత్రాలు, సదస్సుల ద్వారా విస్తృత ప్రచారం చేయాల్సిన అ వసరముంది. రక్తదానం మించిన దానం లేదు అన్న నినాదాన్ని విశ్వవ్యా ప్తం చేయాలి. ప్లాస్మాను దానం చేసే విషయంపై కూడా అందరికీ అవగాహన కల్పించాలి. రక్తదానం ప్రయోజనాలు, ఆవశ్యకత ప్రతీ ఒక్కరికి వి వరిద్దాం. రక్తదానం చేయడానికి ముందుకు వద్దాం.

 కామిడి  సతీష్  రెడ్డి, 9848445134