22-01-2026 12:25:30 AM
అధికారులు స్పందించాలంటూ విజ్ఞప్తి
సిద్దిపేట, జనవరి 21 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల లో పనిచేసిన వీడియో గ్రాఫర్ల కష్టాన్ని ప్ర భుత్వం దోచుకుంది. ఎముకలు కొరికే చలిలో సైతం సమయపాలన లేకుండా పనిచేసిన వీడియో గ్రాఫర్లకు రాష్ట్ర ప్రభుత్వం సరైన వేతనం ఇవ్వడం లేదని బాధితులు మండిపడుతున్నారు. 22 రోజులు ఎన్నికల ప్రక్రియను క్షణం క్షణం, కంటిమీద కొనుకు లేకుండా కాలికి రెస్టు లేకుండా పనిచేసిన కూడా ఫలితం లేదు.
సిద్దిపేట జిల్లాలో మూ డు బృందాలుగా వీడియో గ్రాఫర్లను నియమించారు. ప్రతి మండలానికి ఒక వీడియో గ్రాఫర్ తో పాటు మరో 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. ఇలా జిల్లా వ్యా ప్తంగా సుమారు 30 మందికి పైగా వీడియో గ్రాఫర్లు 22 రోజులు విధులు నిర్వహించారు. అయితే లాంసాం అమౌంట్ గా 22 రోజులకు విఎస్టి లకు రూ.5వేలు, ఎఫ్.ఎస్. టి లకు రూ.8వేలు, ఎస్ ఎస్ టి లకు రూ.10వేల చొప్పున జిల్లా అధికారులు అం దించేందుకు నిర్ణయించారు.
కానీ ఇదివరకు జరిగిన ఎన్నికలలో రోజుకు రూ.3వేల చొ ప్పున వేతనం ఇచ్చారని ఇప్పుడు మాత్రం రోజుకు కనీసం రూ.3వందలు కూడా ఇవ్వ డం లేదని బాధిత వీడియో గ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి వీడియో గ్రాఫర్లుగా పనిచేసిన వారికి అన్యా యం జరిగిందని ఆరోపిస్తున్నారు. సమయపాలన లేకుండా ప్రతిక్షణం ఎన్నికల నియ మావళిని వీడియోలో బంధించి పనిచేసిన వీడియో గ్రాఫర్లకు న్యాయం చేయాలని కో రుతున్నారు. ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారిని వివరణ కోరగా రాష్ట్ర ఎన్ని కల సంఘం ఇచ్చిన ఆదేశాలను మాత్రమే అమలు చేస్తున్నామన్నారు.
కానీ వీడియో గ్రాఫర్ల విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్ స్పందిం చి ఎన్నికల కమిషన్ ఇచ్చిన వేతనం కంటే కొంత మొత్తాన్ని పెంచి ఇవ్వాలని నిర్ణయించమని, ఇతర జిల్లాలలో లేనివిధంగా సిద్ది పేట జిల్లాలో వీడియో గ్రాఫర్లు అధిక మొ త్తంలో ఇవ్వాలని కోరడం, ఎన్నికల సంఘం నియమావళికి విరుద్ధం అవుతుంది. ఎన్నికల నియమ, నిబంధనలు పాటించి వేతనం చెల్లించాల్సి ఉంటుంది. మరోసారి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిం చేందుకు కృషి చేస్తానన్నారు.
అధికారులు ఆలోచించాలి
ప్రభుత్వ అధికారులు ఎన్నికల విధులలో పని చే సినట్లే మేము ని రంతరం పనిచేశా ము. కానీ ఉద్యోగులకు ఇచ్చిన వేతనం మాకు ఇవ్వమని అడగటం లేదు. ఇదివరకు ఎన్నికలలో పనిచేసిన వీడియో గ్రా ఫర్లకు ఇచ్చినట్లుగానే ఈసారి మాకు ఇ వ్వాలని విజ్ఞప్తి. విషయాన్ని అధికారులకు విన్నవించాం సా నుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాము.
నూనె రమేశ్ , హుస్నాబాద్
కెమారాకు రూ.వెయ్యి రెంట్
వీడియో కెమెరా అద్దెకు తీసుకొని ఎన్నికల విధులలో వీడియో గ్రాఫర్ గా పనిచేసిన. ఇదివరకు రో జుకు వీడియో గ్రాఫర్ కు రూ.3వేలు ఇచ్చారు. అదే ఆశతో ఈసా రి కెమెరా లేకపోయినా అద్దెకు తీసుకొని పనిచేసిన కానీ కనీసం రోజుకు రూ.5 వందలు కూడా ఇవ్వడం లేదు. అద్దెకు తెచ్చిన కెమెరాకి రూ.22 వేలు చెల్లించిన నాకు మాత్రం రూ.8వే లు ఇస్తున్నారు. ప్రభుత్వం కోసం పనిచేసి అప్పు చేయాల్సి వచ్చింది.
అధికా రులు మా సమస్యని అర్థం చేసుకొని తగిన న్యాయం చేస్తారని విజ్ఞప్తి. భవిష్యత్తులో ఎన్నికలలో వీడియో గ్రాఫర్ గా చేయాలంటే ఎవరు ఆసక్తి చూపరు. విషయాన్ని జిల్లా కలెక్టర్ కి విన్నవించాం మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.
సంఘం రమేష్, దుబ్బాక