22-08-2025 02:17:48 AM
సదస్సులో పాల్గొన్న 200 మంది కీలక భాగస్వాములు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 21 (విజయక్రాంతి): ఇండియా వాణిజ్య, పరిశ్రమ ల సంఘం (అసోచామ్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన అగ్రిబిజ్ కనెక్ట్ 2025 విజయవంతంగా పూర్తయ్యింది. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్‌పై సదస్సులో ముఖ్యంగా చర్చించారు. ఈ సదస్సులో వ్యవసాయ పరిశ్రమకు చెందిన 200 కంటే ఎక్కువ మంది కీలక భాగస్వాములు పాల్గొన్నారు.
అసోచామ్ దక్షిణ భారత వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ కౌన్సిల్ చైర్మన్, వుమెనోవా ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ రంగయ్య వీ సేట్లెం మాట్లాడుతూ.. సంప్రదాయ వ్యవసాయ ప ద్ధతులు, ఆవిష్కరణలు, మార్కెట్ అనుసంధానాలను వ్యూహాత్మకంగా కలిపి గ్రామీణ అభ్యున్నతి, అగ్రి-పారిశ్రామిక స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
కొండలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతూ, ఉద్యానవన ఆధారిత వృద్ధి రైతుల ఆదాయాన్ని పెంచడంలో, ఆహార భ ద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కేపీఎంజీ ఇండియా భాగస్వామి, సీనియర్ అడ్వుజర్ గోపినాథ్ కోనేటి, పద్మశ్రీ యద్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.