22-08-2025 02:18:39 AM
దళిత చైతన్య సంఘం
ముషీరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధి కారులు, చైన్ మెన్ల అవినీతి కారణంగా అక్ర మ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని దళిత చైతన్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగ అన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఉద్యోగుల అండతో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకుంటామని వెల్లడించారు.
ఈ మేరకు గురు వారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్లోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యులు తీగల శివకుమార్, మధుసూదన్ రావు, చిలకపాటి సుశీల్ రాజ్, బి. నవీన్ కుమార్ లతో కలిసి ఆయన మాట్లాడారు. చైన్ మెన్ లు భవన యజమానులకు సహకరిస్తూ లక్షలాది రూపాయలు అడ్డగోలుగా సంపాదిస్తు న్నారని తెలిపారు. సికింద్రాబాద్, బేగంపేట పరిధిలోని 8 మంది చైన్ మెన్లపై జిహెచ్‌ఎంసి కమిషనర్ కర్ణన్ కు ఇటీవల ఫిర్యాదు చేశామన్నారు.
వీరిని కమిషనర్ చార్మినార్ ప్రాంతానికి బదిలీ చేసినట్లుగా చెప్పారు. 20 ఏండ్లుగా జిహెచ్‌ఎంసి కి చెందిన పలు విభాగాల అధికారులు ఒకే చోట తిష్ట వేసి అవినీతికి పాల్పడుతున్నట్లుగా వెల్లడించారు. ఒక ఉద్యోగి 2 ఏళ్లకు మించి ఒకే చోట పని చేయకూడదని నిబంధనను వీరు అతిక్రమిస్తున్నట్లుగా చెప్పారు. ఇటువంటి అధికారుల జాబితాను కమిషనర్‌కు అందించనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో పలువురు అవినీతి అధికారులు కోట్లకు పడగలెత్తినట్లుగా చెప్పారు. జిహెచ్‌ఎంసిలోని అవినీతి అధికారులను బదిలీ చేసేంత వరకు తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు.