27-01-2026 01:19:22 AM
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవం సందర్భం గా సోమవారం లోక్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం జరిగింది. నేతలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే ఏకే సింగ్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులు పాల్గొ న్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను జిష్ణుదేవ్‌వర్మ ప్రదానం చేశారు. 2025 సంవత్సరానికి మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ అండ్ మెడికల్, కార్పొరేట్ వలంటిరింగ్ అనే నాలుగు విభాగాల్లో స్వచ్ఛంద సేవలు అందించిన వారికి, సంస్థలకు ఈ అవార్డులను ఇచ్చారు.
మహిళా సాధికారత కింద హైదరాబాద్‌కు చెందిన రమాదేవి కన్నెగంటి, గిరిజాన అభివృద్ధికి ఆదిలాబాద్ జి ల్లా వాఘాపూర్‌కు చెందిన తొడసం కైలాష్, రూరల్ హెల్త్ అండ్ మెడికల్‌లో సేవలకు గాను హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రద్యూత్ వాఘ్రే, కార్పొరేట్ వలంటిరింగ్‌పై హైదరాబాద్‌కు చెందిన రాజన్నకు గవర్నర్ అవార్డులను ప్రదానం చేశారు. ప్రతి అవార్డుకు రూ.2 లక్షల నగదు, విశిష్ట సేవలను గుర్తించే ప్రశంసాపత్రాన్ని అందజేశారు.