calender_icon.png 9 October, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీసీలో శిక్షణతో విద్యార్థుల భవిష్యతుకు బాట

09-10-2025 12:00:00 AM

కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఏటిసిలో శిక్షణ పొందుతున్న విద్యార్థిని, విద్యార్థులకుథియరీ, ప్రాక్టికల్ క్లాసులు ఆధునిక యంత్రాలతో సమగ్రంగా నిర్వహించాలని, విద్యార్థులకు తాజా సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు.బుధవారం జిల్లా కేంద్రం లో ప్రభుత్వ ఐ.టి.ఐ. (బాలుర) మరియు (బాలికల) ఆవరణలో ఏర్పాటు చేసిన అడ్వానస్డ్ ట్రైనింగ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ తో కలిసి సందర్శించారు.

ఏటిసి లో ఆధునిక సాంకేతిక శిక్షణ కోర్సుల గురించి కలెక్టర్ కు ప్రిన్సిపాల్ వివరించారు. ప్రిన్సిపల్స్, బోధనా సిబ్బందికి కలెక్టర్ సూచనలు చేశారు. ఏ.టి.సి లో అందిస్తున్న కోర్సులు దేశీయంగా మాత్రమే కాకుండా విదేశాలలో కూడా అత్యుత్తమ ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులని, విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలు అందించడం అత్యవసరమని కలెక్టర్ పేర్కొన్నారు.

తొలుత జిల్లా కేంద్రం లో ని బస్టాండ్ సమీపంలోనిబాదం రామస్వామి,సరోజా దేవి మున్సిపాలిటీ గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియం, మున్సిపాలిటీలో కళా భారతి, భవనాలను కలెక్టర్ పరిశీలించారు.బాదం రామస్వామి & సరోజా దేవి మున్సిపాలిటీ గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియం ను పరిశీలించి కావలసిన రిపేర్ ల గురించి తెలుసుకుని సూచనలు చేశారు. కళా భారతి నిర్మాణం ను పరిశీలించి నిర్మాణ ప్రగతి గురించి తెలుసుకున్నారు.. ఈ కార్యక్రమాల్లో బాలుర ఐ.టి.ఐ ప్రిన్సిపల్ శ్రీ బి. శాంతయ్య, బాలికల ఐ.టి.ఐ ప్రిన్సిపల్ ఎస్. గోపాల్ నాయక్, ఐటిఐ, ఏటిసి బోధనా సిబ్బంది పాల్గొన్నారు.