calender_icon.png 9 October, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ ముందు ప్లెక్సీ పంచాయితీ

09-10-2025 12:00:00 AM

పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ ముందు బీజేపీ నేతల ధర్నా 

కల్వకుర్తి సెప్టెంబర్ 8 : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వల్ల ఏర్పడ్డ ఘర్షణ తీర పోలీస్ స్టేషన్ చెంతకు చేరింది ఈ నేపథ్యంలో తమ నాయకుడిని స్టేషన్ కి పిలిచి అకారణంగా చితక బాదారని నిరసిస్తూ బిజెపి నేతలు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకుదిగారు. వివరాల్లోకెళ్తే.. దసరా పండుగ సందర్భంగా వెల్దండ మండలం పెద్దాపురం గ్రామంలో దుర్గామాత వద్ద కొందరు ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా మరికొందరు దానిని తొలగించారు.

దీంతో ఇరువురి మధ్య గొడవలు రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు బీజేపీ పార్టీకి చెందిన హరి ప్రసాద్ గౌడ్ ను స్టేషన్ కు పిలిపించి చితకబాదినట్లు బాధితుడు తెలిపారు. దీంతో ఆ పార్టీ నాయకులతో కలిసి బుధవారం స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, నాయకులు ఆ పార్టీ నాయకులు పోలీసులతో మాట్లాడారు. అనంతరం ఆందోళన విరమింప చేశారు.